సుధా బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం

సుధా బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం. సుధా బ్యాంకు యండి పెద్ది రెడ్డి గణేష్ 

గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట: సుధాబ్యాంక్ నూతన కమిటీ నీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సుధా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సుధా బ్యాంక్ మేనెజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల అధికారి మురళీ రమణ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ గత పది రోజులుగా కొనసాగి ప్రశాంతంగా ముగిసింది. సుధా బ్యాంక్ చైర్మన్ గా మీలా మహదేవ్ ,వైస్ చైర్మన్ గా కక్కిరేణి చంద్ర శేఖర్ ,ఎన్నికయ్యారు. గత పాలకవర్గంలో ఉన్న డైరెక్టర్లు కక్కిరేణి చంద్రశేఖర్, డాక్టర్ మీలాసందీప్. అడ్వకేట్ ఏపూరి శ్రవణ్ కుమార్, బాణావత్ సుజాత, తిరిగి ఎన్నిక కాగా , నూతనంగా అప్పం శ్రీనివాస్ , డాక్టర్ మిన్నా విజయలక్ష్మి, పటేల్ నరసింహారెడ్డి,తోట శ్యాంప్రసాద్ ,అనంతుల శారద, ఎన్నికయ్యారు. ఎన్నికైన పాలకవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. గత ఏడుసార్లుగా పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సహకార బ్యాంకుల చరిత్రలో ఒక రికార్డుగా ఎన్నికల అధికారి చెప్పారు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ బ్యాంకు యొక్క పనితీరు బ్యాంకు అందిస్తున్న ఉత్తమ సేవల ఫలితంగా సుధాబ్యాంక్ పట్లవాటాదారులలోను ఖాతాదారులలోనూ అచంచలమైన విశ్వాసం ఉందని, ఈ ఎన్నిక ద్వారా తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు.

వాటాదారులందరూ ఈ ఎన్నికల ద్వారా మాపై ఉంచిన విశ్వాసాన్ని మరిన్ని మెరుగైన ఫలితాలతో నిరూపించుకుంటామని పెద్దిరెడ్డి గణేష్ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram