జూబ్లీహిల్స్ బైపోల్.. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ..డ్రోన్లతో నిఘా

 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ .డ్రోన్ కెమెరాలతో నిఘా. విధుల్లో 2,060 మంది పోలింగ్ సిబ్బంది

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: జూబ్లీహిల్స్ బై పోల్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్,తెలిపారు. జూబ్లీహిల్స్ లో 4 లక్షల 1 వెయ్యి 365 ఓటర్లు ఉన్నా రని తెలిపారు. జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నా రని ఓటర్లు ముందుకు వచ్చి ఓటు వేయాలని అయన పిలుపునిచ్చారు.

 

నియోజకవర్గంలో మొత్తం 407పోలింగ్ కేంద్రాలలో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ ను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తామని తెలిపారు. ఈసారి నాలుగు బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నామని ఆయన అన్నారు.జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం ముగిశాక కూడా ప్రచారంలో పాల్గొంటే కేసులు పెడతామని, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ అన్నారు.

 

ఈ సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు ఉంటాయ ని చెప్పారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం నిషేధమని కర్ణన్ అన్నారు. బల్క్‌ మెసేజులు కూడా పంపించకూడదని చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ఠమైన నిఘా ఉంటుందని అన్నారు.

 

ఉప ఎన్నికలో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని, రేపు కోట్ల విజయ్‌భాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తామని చెప్పారు.

Facebook
WhatsApp
Twitter
Telegram