అక్రమ సంబంధమే హత్యకు దారి తీసింది

హత్యకు దారితీసిన అక్రమ సంబంధం..అనాధలైన పసిపిల్లలు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ :మేడ్చల్ జిల్లా,కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సూరారం కాలనీ,రాజీవ్ గృహకల్ప కు చెందిన సున్నపోల్ల రమేష్ (35)కి మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చిట్కూల బలరాం – మల్లమ్మ కూతురు స్వాతి(28) తో గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సాత్విక్(12),వర్షిత్ (9). గత ఐదు సంవత్సరాల క్రితం స్వాతి తన అత్తతో గొడవపడి భర్త పిల్లలతో కలిసి గ్రీన్ హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అపార్ట్మెంట్ యజమాని అయిన బోయ కిషన్ (43) ఎల్లమ్మ బండ నివాసి. తన ఆర్థిక, రాజకీయ పలుకుబడితో రౌడీ షీటర్ గా చలామణి అవుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లల్లో ఆస్తులు సంపాదించి సుఖ భోగాలకు అలవాటు పడ్డాడు. అందులో భాగంగా గ్రీన్ హిల్స్ కాలనీలోని తన అపార్ట్మెంట్లో అద్దెకు నివాసం ఉంటున్న స్వాతి పై తన కన్ను పడింది. ఎలాగైనా స్వాతిని లోబర్చుకొని అనుభవించాలని ప్లాన్ వేశాడు. స్వాతి కుటుంబం యొక్క ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకొని స్వాతికి మాయమాటలు చెప్పి డబ్బు ఆశచూపి లొంగదీసుకున్నాడు. ఆలా గత సంవత్సర కాలంగా స్వాతి తో బోయ కిషన్ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అనుమానం వచ్చిన స్వాతి భర్త రమేష్ మొదట్లో పలు మార్లు తన భార్యను మందలించాడు. ఐనా తీరుమర్చుకోని స్వాతి తన తల్లి మల్లమ్మ, ప్రియుడు కిషన్ తో కలిసి తమ అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న రమేష్ ని అడ్డు తొలగించుకోలని భావించారు. పథకం ప్రకారం రమేష్ పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. గత సంవత్సర కాలంనుండి స్వాతి తన భర్త రమేష్ ను వదిలేసి తన పిల్లలతో ఒంటరిగా బోయ కిషన్ అపార్ట్మెంట్ లోనే నివాసముంటూ తన అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది.నాటినుండి కిషన్,స్వాతి లు ఇద్దరు స్వంత భార్య భర్తల్లా వ్యవహరిస్తూ సినిమాలు, షికార్లు, యాత్రలు తిరుగుతూ అడ్డూ అదుపు లేకుండా వారి అక్రమ సంబంధాన్ని కొనసాగించారు.తన భర్తను సైతం వదులుకొని తనతోనే సహజీవనం కొనసాగిస్తున్నందుకు అప్పటికే పెళ్ళై భార్య పిల్లలు ఉన్న కిషన్ తో తనను రెండవ పెళ్లి చేసుకోవాలనీ స్వాతి ఒత్తిడి చేసింది. కిషన్ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నవారినుండి స్వాతి అద్దెలు వసూలు చేస్తూ తనే వాడుకునేది.అంతటితో ఆగకుండా తను ఉంటున్న అపార్ట్మెంట్ ను తనపేరున రాసి ఇవ్వాలని కిషన్ తో పట్టుబట్టింది.ఈ వ్యవహారమంతా బోయ కిషన్ కుటుంబ సభ్యులు తెలిసింది. అప్పటినుండి వారిమధ్య గొడవలు మొదలయ్యాయి. గత పది రోజుల క్రితం కిషన్ కుటుంబ సభ్యులు స్వాతి ఉంటున్న నివాసనికి వచ్చి అక్రమ సంబంధాన్ని మానుకోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. ఐనా తీరు మార్చుకోకపోవడంతో ఎలాగైనా స్వాతిని అడ్డు తొలగించుకోవాలని బోయ కిషన్ కుటుంబ సభ్యులు భావించారు.బౌరంపేట్ కే ఎల్ హెచ్ యూనివర్సిటీ సమీపంలో ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్న బోయ కిషన్ అల్లుడు బోయ రాజేష్ (26) తన మామ ఐన కిషన్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేస్తున్న నడిందొడ్డి వంశీ (24) తో కలిసి స్వాతి హత్యకు కుట్ర పన్నారు. అందులో భాగంగా శనివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో బోయ రాజేష్,కిందొడ్డి వంశీ లు కలిసి గ్రీన్ హిల్స్ కాలనీ లోని అపార్ట్మెంట్ లో నివాసముంటున్న స్వాతి ని పసి వయసు ఉన్న తన కొడుకు కళ్ళముందే అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. దృశ్యాలు అక్కడున్న సీ సీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని తెలిపారు. తరువాత పోలీసుల ఎదుట నిందితుడు బోయ రాజేష్ లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.అనంతరం

పరారీలో ఉన్న నడిందొడ్డి వంశీ, బోయ కిషన్ లను అరెస్ట్ చేసి వారినుండి మూడు సెల్ ఫోన్లు,హత్య కు ఉపయోగించిన ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం దుండిగల్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డివిజన్ ఏసీపీ సిహెచ్.శంకర్ రెడ్డి దుందిగల్ సిఐ పి.సతీష్,డిఐ ఎం.బాల్ రెడ్డి, ఎస్ ఐ యం.రామ్ మోహన్ రెడ్డి, డబ్ల్యూఎస్ఐ టి. సరళ, హెచ్ సి ప్రభాకర్ రెడ్డి, పిసి వి.రాజు,గణేష్ కుమార్, రమేష్ ల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం ముగ్గురిని బోయ రాజేష్, నడిందొడ్డి వంశీ, బోయ కిషన్ పై  కేసు నమోదు  చేసినట్లు వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram