గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా స్వగ్రామమైన సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో సోమవారం ఆ రాష్ట్ర హోం మంత్రి విజయశర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని హిడ్మా తల్లితో కలిసి భోజనం చేశారు. హిడ్మాను లొంగిపోయేలా ఒప్పించాలని హోంమంత్రి హిడ్మా తల్లిని కోరారు. మావోయిస్టు కంచుకోటగా పేరొందిన పువర్తిలో హోం మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Post Views: 26








