లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు షాక్

అడ్డగోలుగా అప్పులిస్తే పదేళ్ల జైలు – యాప్ల ద్వారా అప్పులిచ్చినా శిక్ష, పెనాల్టీ తప్పవు – బంధువులకు మినహాయింపు

లైసెన్స్ లేకుండా, అడ్డగోలుగాఅ ప్పులిచ్చే వారిని, సంస్థలను శిక్షించేందుకు ప్రభుత్వం కొత్త బిల్లును ప్రపోజ్ చేసింది. పెనాల్టీలతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. ఆర్బిఐ రెగ్యులేటరీ సంస్థల అనుమతులు లేకుండా అప్పులిస్తున్న సంస్థలను, ఇండివిడ్యువల్స్ను కంట్రోల్ చేసేందుకు, వినియోగదారులను రక్షించేందుకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ 2021లో డిజిటల్ లెండింగ్పై రిపోర్ట్ను ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. కాగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్న కేంద్రం.

చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను రూపొందించిన సర్కారు. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం ఇక కుదరనట్టే.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram