అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఎఫ్ఎల్ఎన్

మండలంలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసిన ఉపాధ్యాయులు.

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం /  ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని కరకగూడెం మండలంలో ఉపాధ్యాయులు సమర్థంగా అమలు చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక సెల్ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మండలంలో మూడు రోజుల పాటు చేపట్టిన ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ శాంపిల్ సర్వే శుక్రవారంతో ముగిసింది. ఈనెల 25 నుంచి 27 వరకుMPPS మొగలితోగు ,రేగళ్ల మద్దెలగూడెం పాఠశాలలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండో తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత స్థాయిని అంచనా వేయడం జరిగిందని తెలిపారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో మరియు మానిటరింగ్ బృందం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం క్రమబద్ధంగా, విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు

ప్రతి విద్యార్థిలో ప్రాథమిక అక్షరాస్యత పునాదులను బలోపేతం చేయడం ఈ ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చిన్నారుల్లో అక్షరాస్యత, గణిత నైపుణ్యాల స్థాయిని అంచనా వేసేందుకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సర్వే విజయవంతంగా పూర్తి కావడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సర్వేలో భాగంగా విద్యార్థుల ప్రతిభను టింగరిన్ యాప్ (Tingrin App) ద్వారా ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. డిజిటల్ విధానంలో తక్షణ నమోదు చేయడం ద్వారా పారదర్శకత, ఖచ్చితత్వం పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram