12 ఏళ్ల బాలికపై 84 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం : నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష.

గోల్డెన్ న్యూస్ /రంగారెడ్డి/ జిల్లాలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మార్చిలో జరిగిన దారుణ ఘటనలో నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది.

ఆరోపణల ప్రకారం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వెంకటనారాయణ (84) మానసిక వికలాంగత ఉన్న 12 ఏళ్ల బాలికను చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

 

బాలిక తండ్రికి అనుమానం రావడంతో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

విచారణ అనంతరం రంగారెడ్డి జిల్లా ప్రత్యేక POCSO కోర్టు నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

 

బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం. చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

 

పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram