భారీ వర్షాలు.. ఇళ్ల నుంచి బయటకు రావద్దు: సీపీ సజ్జనార్‌

గోల్డెన్ న్యూస్/తెలంగాణ / హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ వీసీ సజ్జనార్‌ సూచించారు. అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగేలోపే పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని, నీరు నిలిచిన రహదారులు, లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram