వర్షాలు.. నేడు, రేపు స్కూళ్లకు సెలవు

వర్షాల దృష్ట్యా నేడు, రేపు పాఠశాలలకు సెలవులు. కలెక్టర్ అంకిత్ 

 

కొత్తగూడెం : జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు మరియు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రెండు రోజులు సెలవులు ప్రకటించారు.వర్షాల కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల MEOలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు మరియు సంబంధిత RCOలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram