భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రకటన ద్వారా తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలు జరిగే ప్రధాన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.భద్రాచలం నిమజ్జనం ఘాట్ వద్ద పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Post Views: 14









