ఐలాపురం బ్రిడ్జిపై భారీ గోతులు.. పట్టించుకోని ప్రభుత్వం: రేగా కాంతారావు
పినపాక : పినపాక మండలం మణుగూరు–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై ఐలాపురం బ్రిడ్జి వద్ద పెద్దపెద్ద గోతులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం పినపాక మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డితో కలిసి బ్రిడ్జి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. బ్రిడ్జిపై రహదారి దెబ్బతినడంతో ఇనుప సువ్వలు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారిన పరిస్థితిని పరిశీలించారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రేగా కాంతారావు విమర్శించారు. వెంటనే బ్రిడ్జిపై ఏర్పడిన గోతులను పూడ్చి, ఇనుప సువ్వలు బయటకు రాకుండా మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
Post Views: 14








