కరకగూడెం పి హెచ్ సి ని సందర్శించిన డి ఎం హెచ్ ఓ

కరకగూడెం పీహెచ్ సీ లోజరుగుతున్న ఆశా డే కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా వైద్యాధికారి డా. తుకరాం రాథోడ్

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.తుకారాం రాథోడ్ మంగళవారం కరకగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. స్థానిక వైద్యాధికారి పి రవితేజ తో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు ఈ సందర్భంగా ల్యాబ్ , ప్రసవాల గదిని, ఫార్మసి గదిని పరిశీలించి తగు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఆస్పత్రిలో జరుగుతున్న ఆశాడే ను  పరిశీలించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..వర్షాకాల కావడం వల్ల  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆశ కార్యకర్తలు తమ పరిదిలోని గ్రామాలలో ముందుగా నిర్ణయించుకున్న యాక్షనప్లాస్ ప్రకారం ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం ఉన్న ప్రతిఒక్కరికి రక్త పరిక్షలు చేయాలని ఆదేశించారు.

 

గర్భిణి స్త్రీలకు సకాలంలో రక్త పరీక్షలు చేసి రక్తహీనత నుండి కాపాడాలని, అదేవిధంగా గ్రామాలలో మూడ నమ్మకాల ను తొలగించుటకు శృషి చేయాలని సూచించారు, సిరియన్ కేసులు ఏమైనా ఉండి పై సిబ్బంది, పీహెచ్ సి వైద్యాధికారికి తెలియ పరచాలన్నారు.ప్రతినెల కాన్పుల సంఖ్యను పెంచాలని సిబ్బందికి తెలియజేయడం జరిగింది.

 

RMP /PMP లు పరిధికి మించివైద్యం చేయరాదని, మరియు మలేరియా డేంగి కేసులు నమొదు అయితే వెంటనే స్థానిక వైద్యాధికారికి తెలియజేయాలని అంటువ్యాధనలు, వాంతులు, విరోచనాలు, వ్యాధులు సంభవించినప్పుడు స్థానిక వైద్యాధికారికి తెలియజేయాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రతాప్, జిల్లా వైద్య సిబ్బంది CHO నాగభూషణం, హెచ్ ఈ ఓ రాంప్రసాద్, హెచ్ ఈ ఓ కృష్ణయ్య, HV. శ్రీమతి పద్మ. HAG) నర్వింహరావు  స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram