గోదావరి మధ్యలో చిక్కుకున్న 100 మంది కూలీలు

 

 

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురంలో గోదావరి వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో సుమారు 100 మంది మిర్చి వ్యవసాయ కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. మధ్యలో ఇసుకపాయ ఉండటాన్ని గమనించకపోవడంతో నీటిమట్టం పెరిగి వరద మధ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఇరప వసంత్, ఎడారి శ్రీను గ్రామస్థులతో కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram