వనజ మృతి పై విచారణ చేపట్టిన డిఎంహెచ్ఓ

గోల్డెన్ న్యూస్ /గుండాల /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన కుంజా వనజ ప్రసవం కోసం స్థానిక వైద్యశాలలో చేరి మృతిచెందిన ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి (డిఎంహెచ్వో) డా.తుకారాం రాథోడ్, డి సి హెచ్ ఎస్ డా.రవిబాబు శుక్రవారం విచారణ చేపట్టారు. శంభునిగూడెం గ్రామ పెద్దలతోపాటు వనజ భర్త సంజీవరావుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతికి గల కారణాలు, సిబ్బంది నిర్లక్ష్యం, కాన్పు సమయంలో సేవలపై అడిగ తెలుసుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram