గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు విత్తన డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పలు విత్తన విక్రయ దుకాణాలను ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుకాణాల్లో విక్రయిస్తున్న విత్తన ప్యాకెట్ల లాట్ నంబర్లు, తయారుచేసిన కంపెనీ వివరాలు పరిశీలించారు. విక్రయించే ధరలు కూడా దుకాణాల్లో ఏర్పాటు చేసే సూచికపై ఉండాలని ఆదేశించారు. సిఐ వెంట స్థానిక ఎస్సై పివీ నాగేశ్వరరావు. ఉన్నారు.

Post Views: 586







