పదిహేనేళ్లు దాటిన వాహనాలను ఇకపై తుక్కుగా మారుస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా స్క్రాప్ చేసిన తర్వాత ‘సర్టిఫికెట్ ఆఫ్ స్క్రాపింగ్’ను కేంద్రం మంజూరు చేస్తుంది. దీనిని వాహనానికి డెత్ సర్టిఫికెట్గా భావించవచ్చు. భవిష్యత్లో కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఈ సర్టిఫికెట్ చూపిస్తే రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది లారీలు, ట్రాక్టర్లు, కార్లకు వర్తించనుంది.
Post Views: 30