గోల్డెన్ న్యూస్ /కీసర : సదానందం కుటుంబం ఈ నెల 8న కీసర ఠాణా పరిధిలో స్థానిక బాలాజీ ఎన్ క్లైవ్ లో తన గృహప్రవేశం చేస్తుండగా ముగ్గురు హిజ్రాలు అక్కడికి చేరుని రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్చేశారు. సదానందం నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో హిజ్రాలు మరుసటి రోజున ఇంకొందరితో వచ్చి నూతన ఇంటి ప్రహరీ గేటును విరగ్గొట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న సదానందంతోపాటు అతడి భార్యపై కర్రలు, రాళ్లతో హిజ్రాలు దాడిచేశారు. దీనిపై ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన 15 మంది హిజ్రాల్లో ఆరుగురిని గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు ఆంజనేయులు సోమవారం తెలిపారు.
Post Views: 73









