ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి. సిఐ నాగబాబు. 

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎక్సలెంట్ స్టార్ హైస్కూల్  సి- టైప్ నందు   బాలలదినోత్సవ సందర్భంగా శుక్రవారం వేడుకలు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మణుగూరు సర్కిల్ ఇన్స్సెక్టర్ నాగబాబు మండల విద్యాధికారి స్వర్ణజ్యోతి పాల్గొని జ్యోతి ప్రజ్జాలను చేశారు అనంతరం ఆటల పోటీలతో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. ఈ సందర్భంగా సీఐ నాగబాబు మాట్లాడుతూ.. విద్యార్థులందరూ కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలన్నారు మరియు సెల్ ఫోన్లలకు దూరంగా ఉండాలని తెలియజేస్తూ, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఎంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఇష్టంతో, కష్టపడి చదివి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటలతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల యాజమాన్యం యూసఫ్ ఖాదర్ యాకుబ్ షరిఫ్ , సమీన ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram