భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యు ఐ డి ఏ ఐ) ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డు లో ఫోటో, ఓ ఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు కార్డు మీద కనిపించే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముద్రిత వ్యక్తిగత తొలగించనున్నారు
ఈ కొత్త కార్డులో ఉండే ఎనిక్రిప్టెడ్ ఓ ఆర్ కోడ్ ద్వారానే అవసరమైన సమాచారం ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. దీనిని కేవలం అధికారిక పద్ధతుల ద్వారా మాత్రమే స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
యు ఐ డి ఏ ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హోటళ్ళు, కార్యాలయాలు, ఈవెంట్లలో ఆధార్ కార్డు ఫోటోకాపీలు తీసుకొని నిల్వ చేసేవారికి ఇది పెద్ద పరిరక్షణగా మారనుంది. ఈ కొత్త రూపకల్పనతో గోప్యత పెరగడమే కాకుండా డేటా దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు.









