గోల్డెన్ న్యూస్/ బూర్గంపాడు / గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడ మొదలైంది నేటి నుంచి అధికారులు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తున్నారు ఈ నేపథ్యంలో బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలులో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను, బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వెంట బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు.
Post Views: 46









