జీపీ ప్రజలకు సర్పంచ్ అభ్యర్థి బంపర్ ఆఫర్

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, చిరుమళ్ళ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉమామహేశ్వరి  ఆ ప్రాంత ప్రజలకు హామీల వరాల  ప్రకటించారు. అందులో ముఖ్యమైనవి . మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని ఇంటింటికి అందించడం,  ఈ పంచాయతీలో ఏ ఇంట్లో పెళ్లి జరిగిన చందా నరసింహారావు గారి ట్రస్ట్ నుండి 5000 రూపాయలు అందించడం , ఈ పంచాయతీలో ఏ కుటుంబంలో వ్యక్తి మరణించిన ఆ కుటుంబంలో తన వంతు సహాయంగా 3000 రూపాయలు అందించడం,  ఈ ప్రాంతానికి సంబంధించి చెరువులలో మోటార్లు వేయించి చెరువులలో నీళ్లు కాపాడుకునేలా చేసి తద్వారా రైతులకు నీటి ఎద్దడి లేకుండా చేయడం, వర్షాకాలం వరద ముంపు గ్రామాలను గుర్తించి ఆ నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీలు నిర్మించడం, నిరంతరం వీధిలైట్లు వెలిగేలా చూడటం , ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా మరణించినప్పుడు దూరపు బంధువులు వచ్చేవరకు  మృతదేహానికి రక్షణగా రిఫ్రిజిరేటర్ సౌకర్యం కల్పించడం , పేద విద్యార్థులకు పై చదువులకు వెళ్లలేక ఉన్నవారికి పై చదువుల నిమిత్తం ఆర్థిక క్రసహాయం చేయడం, క్రీడలలో నైపుణ్యం చూపుతున్న యువతను ప్రోత్సహించడం , గ్రామాలలో చేపలు పెంచుటకు కుంటలు తవ్వించడం పై దృష్టి సారించినట్లు తెలిపారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ  పేదల తక్షాన ఉంటుందని  తన భర్త చందా మధు  పేదల పక్షాన నిలబడి పేదల పక్షాన పోరాడుతున్న వ్యక్తి నన్ను ఈ ఎన్నికలలో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతున్నారు. తనకు కేటాయించిన గుర్తుతో  త్వరలో మీ ముందుకు  వస్తానని ఉమామహేశ్వరి తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram