మీ ఓటు మీ హక్కు – గ్రామ అభివృద్ధి మా బాధ్యత..
ప్రతి ఇంటి అభివృద్ధి – ప్రతి కుటుంబం సంతోషం ఇదే మా లక్ష్యం.
కరకగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో నీ ప్రకటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం మండలంలో స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో గురువారం మండల పర్యటనలో భాగంగా కరకగూడెం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోలేబోయిన సుజాత గెలుపు కొరకు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు.
1. త్రాగునీటి సమస్యల పరిష్కారం
ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా
పాత పైప్ లైన్ మరమ్మతులు అవసరమైతే కొత్త పైపులైన్ ఏర్పాటు..
2. రహదారుల అభివృద్ధి..
అన్ని వీధుల్లో సిసి/బీటీ రోడ్లు ఏర్పాటు
అన్ని వీధుల్లో రాత్రి సమయంలో వీధిలైట్ల ఏర్పాటు ప్రతిరోజు వెలిగేలా చూడటం..
రైతులకు ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్ వద్ద నుంచి మైసమ్మ చెట్టు పక్కగా వెళ్తున్న రహదారి మరమ్మత్తు నూతన సిసి రోడ్డు నిర్మాణానికి కృషి..
వలస ఆదివాసులైన అశ్వాపురం పాడు కాలనీ ప్రజల కొరకు మట్టి రోడ్డు నిర్మాణం..
3. గ్రామాల్లో ప్రతిరోజు శుభ్రత మరియు తడి-పొడి చెత్త సేకరణ..
డ్రైనేజీ లైన్ల మరమ్మత్త మరియు శుభ్రత చేయిస్తాం..
4. ఆరోగ్య సేవలు..
ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తాం..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయించి,
గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడం.
5. విద్యా సదుపాయాల మెరుగుదల..
పాఠశాలల మరమ్మత్తులు మరియు ప్రతిరోజు శుభ్రత చేయించడం..
ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ కి ఎగ్జామ్ కిట్ అందజేత..
గ్రామ క్రీడ మైదానం అభివృద్ధి చేస్తాం..
6. మహిళా సంఘాలకు మరియు మహిళలందరి అభివృద్ధికి తోడుగా ఉంటాం..
7. రైతుకు తోడుగా- రైతుల సంక్షేమం కోసం బోర్లు,నీటి సమస్యల పరిష్కారం, మరియు వ్యవసాయ నిపుణుల సలహాలు..
8. నిరుపేద కుటుంబాల్లో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు దహన సంస్కారాలకు నిమిత్తం 3000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం..
9. అన్ని మతాల పట్ల సమాన గౌరవం- సమగ్ర అభివృద్ధి..
దేవాలయాల అభివృద్ధి..
దేవాలయాల చుట్టూ శుభ్రత, ఉత్సవాలకు మరియు దేవుల్ల పెళ్లిళ్లకు లైటింగ్ ఏర్పాటు అలాగే అన్నదాన కార్యక్రమం నిమిత్తం 5000 రూపాయల అందిస్తాం..
మస్జిద్ ల అభివృద్ధి, మస్జిదుల చుట్టూ శుభ్రత, ఉజూ ఖానా మరమ్మతులు..
పండుగలకు ఉత్సవాలకు లైటింగ్ ఏర్పాటు మరియు పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు నిమిత్తం 5000 రూపాయలు అందిస్తాం..
చర్చిల అభివృద్ధి. చర్చిల చుట్టూ శుభ్రత పండుగల కు లైటింగ్ ఏర్పాటు..
ప్రత్యేక పండుగ అయిన క్రిస్మస్ రోజు అన్నదాన కార్యక్రమం నిమిత్తం 5000 రూపాయలు అందిస్తాం..
10.దసరా పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక కానుక అందచేస్తాం..
పంచాయితీ ప్రజలారా మీ నమ్మకమే మాకు బలం, మీ అభివృద్ధి నా ధ్యేయం,
ఉంగరం గుర్తు పై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అభ్యర్థి పోలేబోయిన సుజాత నీ గెలిపించగలరని కోరారు..
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,మండల నాయకులు ఎర్ర సురేష్,జలగం కృష్ణ,జట్ల సత్యం, చందా వెంకట రత్నమ్మ ,మండల నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…









