పేద విద్యార్థి చదువు కోసం తనఇంటిని తాకట్టు పెట్టిన హరీశ్ రావు

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తన పెద్ద మనసు చాటుకున్నారు. పేద విద్యార్థి వైద్య విద్య కోసం తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు రుణం కోసం తన ఇంటిని తాకట్టు పెట్టి ఓ విద్యార్ధిని పీజీ విద్య పూర్తి చేసేందుకు మద్దతుగా నిలిచారు. ఏదైనా ఆస్తి చూపిస్తేనే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పటంతో హరీష్ ముందుకు వచ్చారు. సిద్దిపేటలోని తన ఇంటికి తాకట్టు పెట్టి రూ 20 లక్షలు విద్యార్ధిని చదువు కోసం విద్యా రుణం ఇప్పించారు.

 

మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షల రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం

 

బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామన్న బ్యాంకు సిబ్బంది

 

ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం

 

దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు

 

హాస్టల్ ఫీజుకి సైతం లక్ష రూపాయలు సహాయం చేసిన హరీష్ రావు.

Facebook
WhatsApp
Twitter
Telegram