దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులను హైటెక్ గా మార్చే దిశగా శనివారం ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. యూపీలోని నోయిడాలో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్ )లో దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) క్లినిక్ ప్రారంభమైంది.
వైద్య రంగంలో మరో కీలక అడుగు పడింది. గ్రేటర్ నోయిడాలోని (యూపీ) గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో దేశంలోనే తొలి ప్రభుత్వ ఏఐ క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్ వైద్యులకు సాయంగా నిలిచి చికిత్సను మరింత కచ్చితంగా మార్చనుంది. అదే విధంగా వ్యాధి లక్షణాలను వేగంగా గుర్తిస్తుంది. మెడికల్ రిపోర్టులను త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు సరైన చికిత్సను సూచించడం వంటివి చేస్తుంది.
Post Views: 26









