అనారోగ్య బాధితురాలికి ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి అండగా నిలిచిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎల్ఓసి అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలం, అనంతారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన (ఇర్ప పుల్లయ్య ) భార్య గీత అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తమకు మెరుగైన వైద్య చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోవడం లేదంటూ వనపర్తి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తమకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి రూ. 3లక్షల, ఎల్ ఓ సి మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ ఓ సి నీ సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్ లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపత్కాలంలో తమకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram