హోరాహోరీగా కబడ్డీ పోటీలు

మూడవ రోజు హోరా హోరిగా కొనసాగిన జాతీయ అండర్‌–17 కబడ్డీ పోటీలు.

 

గోల్డెన్ న్యూస్ /పినపాక / పాఠశాల క్రీడా సమాఖ్య ఆద్వర్యంలో పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరుగుతున్న 69 అండర్ 17 జాతీయ కబడ్డీ పోటీలు మూడవ రోజు హోరా హోరిగా కొనసాగాయి. ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ తీవ్రత కనిపించగా, చివరి నిమిషాల వరకూ ఫలితం తేలని హోరాహోరీ పోరాటాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లలో మొదటి మ్యాచ్లో మణిపూర్ పై ఆంధ్రప్రదేశ్ జట్టు 59-37 స్కోర్ తోవిజయం సాధించింది,రెండో మ్యాచ్లో పుదుచ్చేరి పై సీబీఎస్ఈ జట్టు 54-29 స్కోర్ తో విజయం సాధించింది, మూడవ మ్యాచ్లో బీహార్ పై తెలంగాణ జట్టు 56-33 స్కోర్ తో విజయం సాధించింది, నాలుగో మ్యాచ్లో ఒడిస్సా పై మధ్యప్రదేశ్ జట్టు 44-42 స్కోర్ తో విజయం సాధించింది, ఐదో మ్యాచ్లో మహారాష్ట్ర పై జమ్మూ కాశ్మీర్ జట్టు 33-96 స్కోర్ తో విజయం సాధించింది, ఆరో మ్యాచ్లో సీబీఎస్ఈ వెల్ఫేర్ పై మహారాష్ట్ర జట్టు 77-41 స్కోర్ తో విజయం సాధించింది, ఏడో మ్యాచ్లో ఛత్తీస్గడ్ పై రాజస్థాన్ 38-37 స్కోర్ తో విజయం సాధించింది, ఎనిమిదవ మ్యాచ్లో హర్యానాపై విద్యా భారతి జట్టు 27-41స్కోర్ తో విజయం సాధించింది, తొమ్మిదో మ్యాచ్లో చండీగఢ్ పై ఎన్వీఎస్ జట్టు 59-31స్కోర్ తో విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో మొదటి మ్యాచ్లో జార్ఖండ్ పై త్రిపుర 42-48 స్కోర్ తో విజయం సాధించింది, రెండో మ్యాచ్లో సీబీఎస్ఈ పై పశ్చిమ బెంగాల్ 55-35 స్కోర్ తో విజయం సాధించింది, మూడో మ్యాచ్లో చండీగఢ్ పై పంజాబ్ 98-76 స్కోర్ తో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్లో ఢిల్లీపై గుజరాత్ 34-32 స్కోర్ తో విజయం సాధించింది, ఐదో మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్ పై కేరళ జట్టు37-40 స్కోర్ తో విజయం సాధించింది, ఐదో మ్యాచ్లో ఉత్తరాఖండ్ పై ఉత్తరప్రదేశ్ జట్టు 34- 44 స్కోర్ తో విజయం సాధించింది. ఆరో మ్యాచ్లో అస్సాంపై కె వి ఎస్ జట్టు 45-49స్కోర్ తో విజయం సాధించింది, ఏడో మ్యాచ్లో ఒడిస్సా బై ఎన్వీఎస్ జట్టు 50-36 స్కోర్ తో విజయం సాధించింది.

ముడవరోజు ఆటలో కొందరు ఆటగాళ్లు సూపర్ రైడ్స్‌తో జట్టుకు కీలక పాయింట్లు అందించగా, మరికొందరు అద్భుతమైన టాకిల్స్‌తో ప్రత్యర్థి జట్లను కట్టడి చేశారు. ముఖ్యంగా నాకౌట్ దశకు చేరుకునే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ఉత్కంఠను మరింత పెంచాయి. ఈ వేదిక ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జరిగే కీలక మ్యాచ్‌ల కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram