3 త్రాచు పాములతో ఆస్పత్రికి వెళ్లిన రోగి

ఆసుపత్రి వార్డు అంటే మందుల వాసన, రోగుల మూలుగులు వినిపిస్తాయి.. కానీ అక్కడ మాత్రం నాగుపాముల బుసలు వినిపించాయి! తనను పరిచిన పాము ఏదో వైద్యులకు చూపించాలనే ఆలోచనతో ఒక వ్యక్తి ఏకంగా మూడు పాములతో ఆసుపత్రికి వచ్చాడు. 

వివరాలకు వెళితే : – 

బిహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లా రాజ్‌పుర్‌కు చెందిన గౌతమ్‌కుమార్‌ అనే పాములు పట్టే నిపుణుడు తాను పట్టుకున్న మూడు నాగుపాములను అడవికి తరలిస్తుండగా.. అందులోంచి ఓ పాము కరిచింది. మూడింటిలో ఏది కరిచిందో తెలియని గౌతమ్‌ వైద్యులకు చూపేందుకు ఆ మూడు విషసర్పాలతో నేరుగా సాసారాం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram