పాఠశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేతో చర్చిస్తాం.
పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా విద్యార్థులు నైపుణ్యం కలిగి ఉండాలి.
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిరుమల్ల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన టీపీసీసీ సభ్యులు డాక్టర్.చందా సంతోష్ కుమార్ కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ శనివారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, వసతులను పరిశీలించి ఇంకా మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారాని వారు అన్నారు.
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లి ఆశ్రమ పాఠశాల అభివృద్ధి కొరకు అవసరమైన అన్ని సమకూర్చే విధంగా విద్యార్థులకు మెరుగైన విద్యా , వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని,సంబంధిత అధికారులకు ఐటిడిఏ పిఓ, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ మంత్రికి స్వయంగా కలిసి నివేదిక అందించి మరింత అభివృద్ధి కొరకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో చిరుమల్ల సర్పంచ్ కొమరం సుగుణ-వెంకటేశ్వర్లు, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత మండల నాయకులు ఎర్ర సురేష్, చందా నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కార్యకర్తలు వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










