నేడు మేడారానికి తెలంగాణ సర్కార్ !

 రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ.  300 మంది అధికారులకు ఏర్పాట్లు.భారీ భద్రత మధ్య హరిత హోటల్.

 

గోల్డెన్ న్యూస్ /తాడ్వాయి / రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అక్కడి హరిత హోటల్ కేంద్రంగా కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవడానికి సమాయత్తమైంది.

 

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు.

 

ఇందుకోసం ఆయా శాఖల సెక్రటరీలు, అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. సాయంత్రం అక్కడి హరిత హోటల్ లో జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ నగరం బయట మంత్రి మండలి సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇందుకోసం మంత్రి సీతక్క ఇవాళ (శనివారం ) ఉదయం నుంచి అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

 

సీఎం, మంత్రులు, వివిధశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారు లతో కలిపి సుమారు మూడు వందల మంది అక్కడ బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 28 నుంచి వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్ అక్కడ ఏర్పాటు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

 

సీఎం పర్యటన, కేబినెట్ సమావేశం నేప థ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేశారు. మునుపెన్నడూ లేనంత భద్రను ఏర్పాటు చేశారు. సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంటోంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలోనిర్వహించడం ఇదే తొలిసారి.

 

మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు. కేబినెట్ భేటీలో మరిన్ని నిధులపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఉంటుంది. రైతు భోరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం, మున్సి పల్ ఎన్నికలతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Facebook
WhatsApp
Twitter
Telegram