హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాల
గోల్డెన్ న్యూస్ / హనుమకొండ / డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, అనుబంధ ప్రదేశాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
ప్రాథమిక విచారణలో అక్రమంగా వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు, కీలక పత్రాలు, స్థిరాస్తుల వివరాలపై అధికారులు సవివరంగా పరిశీలిస్తున్నారు. సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది.
Post Views: 38









