తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల సాయంత్రం విడుదల చేసే అవకాశం.
తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలును మంగళవారం విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం సీఎస్ రామకృష్ణారావుతో భేటీ కానుంది. ఆ తర్వాత సాయంత్రం షెడ్యూలు ప్రకటించనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Post Views: 28









