సీఎం రేవంత్ కు సర్టిఫికెట్ అందజేసిన హార్వర్డ్ కెనడీ స్కూల్

 

తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగిన లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ అనే ప్రత్యేక కోర్సులో ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో ఆయన తన శిక్షణను పూర్తి చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు సీఎం హాజరైన విషయం తెలిసిందే. కోర్సు పూర్తి చేయడంతో ఆయన సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ విషయాన్ని సీఎం ఎక్స్‌లో పంచుకున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram