ఖమ్మం విజయంలో ప్రతిభను కనబరిచిన పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వైష్ణవి రత్న
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్లో జరుగుతున్న సీనియర్ ఉమెన్స్ అంతర్ జిల్లాల టి20 క్రికెట్ పోటీల్లో ఖమ్మం జట్టు మెదక్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంలో పినపాక మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి రత్న ప్రతిభావంతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టును కేవలం 44 పరుగులకే ఆలౌట్ చేయడంలో వైష్ణవి రత్న కీలక పాత్ర పోషిస్తూ 3 వికెట్లు సాధించింది. ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ మెదక్ బ్యాట్స్‌మన్‌లను కట్టడి చేసింది. అనంతరం ఖమ్మం జట్టు కేవలం 7 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
వైష్ణవి రత్నతో పాటు మాన్వేషి 3 వికెట్లు, ఝాన్సీ 25 పరుగులతో జట్టు విజయానికి తోడ్పడ్డారు. అయితే యువ క్రికెటర్ వైష్ణవి రత్న ప్రదర్శన ఖమ్మం విజయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విజయం ద్వారా ఖమ్మం జట్టు సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
సాధించింది. ఈ విజయంలో పినపాక మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి రత్న ప్రతిభావంతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.