పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ తుకారాం రాథోడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పి హెచ్ సి లో ఒపి సేవలు, ఇతర ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించారు. మండల వ్యాప్తంగా ఆశాల పనితీరు వారి వివరాలను అరిగి తెలుసుకోవడం జరిగినది.
సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ప్రసూతి గదిని తనికి చేసి గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ రవితేజను ఆదేశించారు. అనంతరం స్థానికవైద్యాధికారి రవితేజ తో కలిసి కుండలం లోని RMP/PMP/ ప్రయివేట్ క్లినిక్లను తనిఖీచేయిడానికి వెళ్లారు. వారు అందుబాటులో లేకపోవడంతో బట్టుపల్లి సబ్ సెంటర్ సందర్మించి క్షేత్ర జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ఏఎన్ఎం జ్యోతి,ఆశా రమదేవిని అడిగి తెలుసుకొని డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కారం మధు, DPMD. శ్రీ మహా DMEHO, గొంది వెంకటేశ్వర్లు, హెచ్ ఈ ఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 25









