పిహెచ్ సీలను తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / పినపాక, జానంపేట,కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పి హెచ్ సి లో ఒపి సేవలు, ఇతర ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించారు. ఇరు మండల మండలాల ఆశాల కార్యకర్తల పనితీరు వారి వివరాలను అరిగి తెలుసుకోవడం జరిగినది.
అలాగే సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ప్రసూతి గదిని తనికి చేసి గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని తినపాక వైద్యాధికారి డాక్టర్ కారం మధు, కరకగూడెం పిహెచ్సి వైద్యాధికారి రవితేజను ఆదేశించారు. అనంతరం కరకగూడెం స్థానికవైద్యాధికారి రవితేజ తో కలిసి మండలంలోని RMP/PMP/ ప్రయివేట్ క్లినిక్లను తనిఖీచేయిడానికి వెళ్లారు. వారు అందుబాటులో లేకపోవడంతో బట్టుపల్లి సబ్ సెంటర్ సందర్మించి క్షేత్ర జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ఏఎన్ఎం జ్యోతి,ఆశా రమదేవిని అడిగి తెలుసుకొని డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫీల్డ్ స్టాప్ తో పాటు ఆశా కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమాలపై రివ్యూ చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించాలని దోమల ఆవాసాలైనటువంటి నీటి తొట్టెలను నివారించాలని దోమ బారిన పడకుండా, మలేరియా డెంగ్యూ జ్వరాలు రాకుండా ప్రజలందరూ జాగ్రత్త వహించే విధంగా స్టాఫ్ అందరు ప్రజలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఉన్నారు.
జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తారీకు వరకు స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించాలని గ్రామములో ఎవరికైనా చర్మంపై మచ్చలు ఉన్నట్లయితే మరియు ఆ మచ్చలు స్పర్శ లేకుండా ఉన్నట్లయితే లెప్రసీసస్పెక్ట్ గా అనుమానించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీసుకొచ్చిన తర్వాత వారికి వ్యాధి ఉన్నట్లయితే ఆరు మరియు 12 నెలల్లో ఆ వ్యాధి లేకుండా మందులు వాడి వ్యాధిని నయం చేయవచ్చునని కాబట్టి గ్రామాలలో పంచాయతీ లెవల్ లో స్కూల్ లెవెల్ లో అందరికీ ఈ వ్యాధులపై అవగాహన కల్పించి కుష్టు రహిత భారతదేశాన్ని నిర్మించాలని చెప్పడం జరిగింది మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరోగ్య సేవలపై మరియు రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ లను తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కారం మధు, డాక్టర్ రవితేజ, DPMD. శ్రీ మహా DMEHO, గొంది వెంకటేశ్వర్లు, హెచ్ ఈ ఓ కృష్ణయ్య రెండు మండలాలకు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 641









