సహజంగా సముద్రాల లో కనిపించే నీటి కుక్క గ్రామ చెరువులో దర్శనం
గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట /సూర్యాపేట జిల్లా, పెన్ పహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలోనీ మధిరామక్క చెరువులో ఉదయం గ్రామస్తులకు నీటి కుక్క కనిపించింది. గ్రామస్తులకు వింతగా కనిపించిన ఆ జంతువును యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఉంచారు. పెద్ద పెద్ద సముద్రాలలో కనిపించే నీటి కుక్క.. తమ గ్రామ చెరువులో కనిపించడంతో ఈ నీటీ కుక్క చూడడానికి గ్రామస్తులు చెరువు దగ్గరికి పరుగులు తీశారు. దీంతో ఆ నీటి కుక్క నెమ్మదిగా నీటిలోకి జారుకుంది
తమ చెరువులోకి నీటీ కుక్క ఎలా వచ్చిందని ఒకవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, నీటి కుక్క నీ తనివి తీరా చూసామని మరోవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 69









