గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కోసం సర్పంచ్ కి వినతి పత్రం అందజేసిన ఆటో యూనియన్ సభ్యులు.
ఈ రోజు (మంగళవారం) కరకగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో కరకగూడెం మండల ఆటో యూనియన్ (రిజి. నెం. 125/A) కమిటీ సభ్యులు సర్పంచ్ పోలేబోయిన సుజాత ని కలిసి కరకగూడెం మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మచాలని వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రమైన కరకగూడెంలో బ్యాంకులు, తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ముఖ్య కార్యాలయాలు ఉండటం వల్ల ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. పబ్లిక్ టాయిలెట్ల సదుపాయం లేకపోవడం వల్ల ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూనియన్ సభ్యులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని గుర్తించి తక్షణమే పబ్లిక్ టాయిలెట్లను మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఆటో యూనియన్ సభ్యులు, వ్యాపారస్తులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు..









