ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు క్లీన్ చీట్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితకు క్లీన్ చీట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారన్న సాక్ష్యా దారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram