వలస ఆదివాసీల సమస్యలపై పోరాడటమే అడమయ్య కి ఇచ్చే ఘనమైన నివాళి

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / వలస ఆదివాసుల సమస్యల పై పోరాడటమే అడమయకిచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు శుక్రవారం కరకగూడెం పంచాయతీ పరిధిలోని అశ్వాపురం గ్రామంలో పొడియం అడమయ్య సంస్మరణ సభలో వారు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీకి అడమయ్య సేవలు ఎనలేనివని వారు పేర్కొన్నారు చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి పొట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి వలస వచ్చి స్థానికంగా సిరనివాసం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వారి సమస్యల పరిష్కారం కోసం ఎనలేని పోరాటాలు నిర్వహించిందని ఈ పోరాటాలలో భాగంగా గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉండబడిన మౌలిక సౌకర్యాల పరిష్కారం కొరకు పార్టీ సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు పోడుభూమి ఇతర సమస్యలు పరిష్కారం కోసం అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు అందువలనే రేషన్ కార్డులు పింఛన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ కాలంలో ఆయన లేకపోవడం సిపిఎం పార్టీకి అడమయ్య లేకపోవడం అంటే పెద్ద లోటని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పూనుకోవాలని వలస ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని వారన్నారు వారి కుటుంబానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు, పినపాక మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్, పార్టీ నాయకులు కురుసం లక్ష్మయ్య, పొడియం మంగయ్య, కోవాసి వెంకటేశ్వర్లు, పదం బాబురావు, ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాసు అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram