మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం అంతం: అమిత్ షా
దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, మావోయిస్టుల నిధులను అడ్డుకోవడం, లొంగుబాటు చర్యలు, భద్రతా దళాల ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు వారి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయని తెలిపారు.
Post Views: 22









