కరీంనగర్-హైదరాబాద్ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం.
గోల్డెన్ న్యూస్/వెబ్ డెస్క్/కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపగా, డ్రైవర్, కండక్టర్లు 37 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు.
అనంతరం మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 15








