ఏటూరునాగారంలో కోర్టు ఏర్పాటు చేయాలి

ములుగు జిల్లా మాల మహానాడు నాయకుడు కాళ్ల రామకృష్ణ డిమాండ్

 

ఏటూరునాగారం :ములుగు జిల్లా ఏటూరునాగారంలో తక్షణమే న్యాయస్థానం (కోర్టు) ఏర్పాటు చేసి, మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ములుగు జిల్లా మాల మహానాడు నాయకుడు కాళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఏటూరునాగారం కేంద్రంగా పరిసర ప్రాంతాలైన కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు తదితర మండలాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల ప్రజలు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల్లోని కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు.దీంతో ప్రజలు ప్రయాణ ఖర్చులు, సమయం వృథా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రజలకు న్యాయ సేవలు సులభంగా అందేలా ఏటూరునాగారంలో కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రాంత ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం, సంబంధిత న్యాయశాఖ అధికారులు ఏటూరునాగారంలో కోర్టు ఏర్పాటుపై తక్షణ చర్యలు చేపట్టాలని కాళ్ల రామకృష్ణ కోరారు. ప్రజలకు న్యాయం మరింత చేరువయ్యేలా ఈ డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram