మా భూములు మాకే కావాలి –

–   ప్రభుత్వం పునరాలోచన చేయాలి

– హెచ్చరిక బోర్డుతో ఆందోళనలో రైతు కుటుంబాలు.  -ఏళ్లుగా భూమిని నమ్ముకొని సాగు చేసుకుంటున్న వైనం -హెచ్చరిక బోర్డుతో ఆ వాక్ అయినా ప్రజలు.

 – రాజకీయపార్టీలు తమకు అండగా నిలవాలని వేడుకుంటున్న  రైతన్నలు..

గోల్డ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: పినపాక మండలంలోని, గోపాలరావుపేట గ్రామ శివారు గల 128 వ సర్వే నెంబర్ బాపనయ్యకుంట పారకం పరిధిలోని 126.07 ఎకరాల భూమిలో శనివారం పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్  ప్రభుత్వ స్వాధీన పరచుకుంటున్నట్లు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ విషయం ఈ ఈ నోట ఆ నోట పడి ఆయకట్టు రైతులకు తెలిసింది. ఒక్కసారి గా ఉలిక్కిపదిన గ్రామస్తులు. ఘటన స్థలానికి చేరుకున్నారు. అకస్మాత్తుగా వచ్చిన అధికారులు నవోదయ పాఠశాల నిర్మాణం కొరకు భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు బోర్డు పెట్టడంతో ఆందోళనకు గురవుతున్నారు..

దాదాపు 100 మంది రైతులు గత 50 సంవత్సరాలు ఆ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఆ భూమిని అకస్మాత్తుగా ప్రభుత్వ భూమిగా ప్రకటించి, పాఠశాల నిర్మాణం కోసం తీసుకోవడంపై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నవోదయ పాఠశాల పినపాక మండలానికి రావడం  హర్షించదగిన విషయమే కానీ, రైతులు సాగు చేసుకుంటున్న భూములు లాక్కుని పాఠశాల నిర్మించడం రైతులకు  చేయడమే అంటున్నారు. అధికారులకు ఖాళీ స్థలం ఎక్కడ దొరకలేదా, మా జీవనాధారమైన పొలాలను తీసుకుంటే, మా కుటుంబాలు వీధిన పడతాయి. మాకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా మేము ఎలా బ్రతకాలి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు..

రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క పోడు భూములకే  హక్కు పత్రాలు ఇస్తామంటున్నారు, మేము చిన్న సన్నకారు రైతులమే మా పంట పొలాలకు పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు, మా భూములను ప్రభుత్వ భూమిగా మార్చడాన్ని మేము ఒప్పుకోలేము. గ్రామంలో ఖాళీ స్థలంలో స్కూల్ నిర్మిస్తే మేము కూడా హర్షిస్తాం. కానీ మా పొలాలను తీసుకోవడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.  ఈ భూములపై మేము మూడు తరాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు ఈ భూములు లేకపోతే, మేము మరో చోట కొనుగోలు చేసుకునే సామర్థ్యం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మా భూముల జోలికి రాకుండా కాపాడాలి, అని విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి, గోపాలరావుపేట రైతులను ఆదుకొని, వారి పంట భూములకు పట్టాలు ఇచ్చి వారి జీవన విధానాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram