పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

ప్రజలకు పోలీస్ చట్టాలపై,చట్ట వ్యతిరేకత కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు మణుగూరు డి.ఎస్.పి రవీందర్ రెడ్డి  ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

 

కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP  రోహిత్ రాజు ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పి  వి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని అశ్వాపురం పాడు గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎస్పి గ్రామస్తులు ఉద్దేశించి అశ్వాపురం పాడు గ్రామంలో గత సంవత్సర కాలంగా జరుగుతున్న వరుస సంఘటనలను ప్రస్తావించి గ్రామస్తులు అందరూ కూడా చట్టాన్ని గౌరవించి చట్టానికి లోబడి జీవించాలని ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు చట్టాన్ని అతిక్రమించే చర్యలు కు పాల్పడవద్దని చెప్పడం జరిగింది. ఎవరైనా అలా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే పోలీసు వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వారిని చట్టం ముందు దోషిగా నిలబెడతారని అందరూ కూడా మంచి వ్యక్తిత్వం నడవడికతో ఉండాలని చెప్పడం జరిగింది . అనంతరం గ్రామంలోని చిన్నపిల్లలకు సుమారుగా 50 మందికి దుస్తుల్ని అందించడం జరిగింది ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా వివరించినట్లయితే వారి పట్ల కఠినంగా వ్యహరిస్తామని పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సిఐ ఈ వెంకటేశ్వరరావు కరకగూడెం ఎస్ఐ పి వి ఎన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram