ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఎత్తివేత.? ఏ రాష్ట్రంలో అంటే.

ఏపీ  ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేయనుంది. అదేవిధంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా  ప్రకటించారు.  కేవలం సెకండియర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి విలువైన సలహాలు సూచనలు సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని అన్నారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడిట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇంటర్నల్‌గా నిర్వహిస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ మొదటి సంవత్సరం అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ప్రవేశ పెట్టబోతున్నట్లు ఇంటర్  బోర్డు అధికారులు తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram