23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు.
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూన్ 23న తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీ విపి తెలిపింది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, యూనిఫాంలు, బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, నాణ్యమైన భోజనం కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Post Views: 8









