వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలి.

వేసవిలో త్రాగు నీటి సమస్య లేకుండా చూడాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

గోల్డ్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : వేసవి లో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా పది రోజుల ప్రత్యేక కార్యచరణ ద్వారా త్రాగునీటి సరఫరా లో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్ ను ప్రత్యేక డ్రైవ్‌పై మండల స్థాయి సమావేశాలను నిర్వహించి, రోజు వారీ షెడ్యూల్‌ను రూపొందించి మండల బృందాలను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.మండల స్థాయిలో ఎంపీడీవో, మిషన్ భగీరథ ఏ ఈ మరియు పంచాయతీ సెక్రెటరీ లు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడైతే త్రాగునీటి సరఫరా లో సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించి తద్వారా వేసవిలో త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దున్నరు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో జనాభా, నీటి నిల్వలు, భగీరథ వాటర్ ట్యాంక్ ఫిల్లింగ్, చేతిపంపుల పనితీరును గుర్తించాలన్నారు. మరమ్మతులకు గురైన చేతి పంపులను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వేసవి కాలంలో అధికారులు వాటర్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలన్నారు. నీటి ఎద్దటి గ్రామాలను గుర్తించి ప్రతీ ఇంటికి నీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలు టోల్ ఫ్రీ నంబర్ 18005994007 ద్వారా తెలియపరచడం వల్ల పరిష్కరింపబడతాయని కలెక్టర్ తెలిపారు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram