170 మొబైల్‌ ఫోన్లు రికవరీ.

– సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను రికవరీ  అధికారులను అభినందించిన  ఎస్పీ

170 మొబైల్ ఫోన్లను బాధితులకు అందసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు .

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న భాదితులకు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి బాధితులకు అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఈ ఐఆర్ పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడం జరిగితుందన్నారు.గత రెండు నెలల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 170 మంది భాధితులకు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో  ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగింది.మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని  వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఎవరైనా తమ మొబైల్ దొంగిలించబడినా,పోగొట్టుకున్నా వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి వారి మొబైల్ ఫోన్లను పొందవచ్చునని తెలియజేశారు.పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్ వివరాలను పొందుపరిచి ఫిర్యాదు చేయగలిగితే అట్టి ఫోన్లను సులభంగా కనిపెట్టవచ్చని  ఎస్పీ  తెలిపారు.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను అవతల వ్యక్తి వినియోగించాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే అట్టి మొబైల్ ను ట్రేస్ చేయగలమని అన్నారు.ఈ సందర్భంగా బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఐటి సెల్ ఇంచార్జి సీఐ నాగరాజు రెడ్డి మరియు ఐటి సెల్ సభ్యులు విజయ్,నవీన్,మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram