Planets Alignment: ఒకే లైన్‌లోకి 7 గ్రహాలు.. నేటి రాత్రికి ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో మహాద్భుత దృశ్యం.. ఇవాళ ఒకే సరళ రేఖపై 7 గ్రహాలు.. చూడవచ్చు..

అంతరిక్షంలో అద్భుతం జరగబోతోంది. ఆకాశంలో సప్తగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చే… ప్లానెట్‌ పరేడ్‌ కనువిందు చేయనుంది. ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చే… ప్లానెట్‌ పరేడ్‌ కనువిందు చేయనుంది.

 

ఖగోళ శాస్త్రంలో దీన్ని ప్లానెట్ పరేడ్‌గా పిలుస్తారు. మహాశివరాత్రి తర్వాత అంతరిక్షంలో గ్రహాలు కనువిందు చేయనుండడంతో, ఇది మరింత విశిష్టత సంతరించుకుంది.

 

ఆ సమయంలో శని, బృహస్పతి, అంగారకుడు, శుక్ర గ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా చూడొచ్చు. అయితే వీటిలో నెప్ట్యూన్‌, యురేనస్ గ్రహాలను చూడడం మాత్రం టెలిస్కోప్ ద్వారానే సాధ్యమవుతుంది.

 

సూర్య కుటుంబంలోని ఆరు గ్రహాలు శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ ఒకే వరుసలోకి వచ్చి చేరగా.. ఇప్పుడు ఈ లైన్లోకి కొత్తగా బుధుడు వచ్చి చేరుతున్నాడు. ఈ ఖగోళ అద్భుతం ఇవాళ మనకు దర్శనం ఇవ్వనుంది.

 

ఇవాళ రాత్రి 8:30 గంటలకు సప్త గ్రహ కూటమి దర్శనం ఇస్తుంది. ఆకాశం మేఘావృతం కాకుంటే, కాలుష్యం తక్కువగా ఉంటే, ప్లానెట్ పరేడ్ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కొన్ని యాప్‌ల ద్వారా కూడా చూడొచ్చంటున్నారు నిపుణులు. స్టార్‌ వాక్‌-2, స్టెల్లారియం యాప్‌లలో 7 గ్రహాల కవాతును చూడొచ్చంటున్నారు.

 

మరోవైపు ఇది ఖగోళంలో అరుదుగా సంభవించే వింత మాత్రమే అని, దీని వల్ల ఎలాంటి ఉత్పాతాలు జరగవంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. మొత్తానికి సప్త గ్రహ కూటమి కవాతును ఈసారి మిస్ అయితే, మళ్లీ 2040 వరకు ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడలేమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram