కాసులకు కక్కుర్తి పడి అమానవీయ కార్యకలాపాలకు పాల్పడి చట్ట విరుద్ధ పనుల కోసం ఆ ముగ్గురు కొత్త పంతులు వెతుక్కున్నారు. రాష్ట్రంలో ముందెన్నడూ విధంగా కారునే లింగ నిర్ధారణ కేంద్రంగా మార్చుకున్నరు.
గోల్డెన్ న్యూస్ / ఖమ్మం :కాసులకు కక్కుర్తి పడి అమానవీయ కార్యకలాపాలకు పాల్పడి చట్ట విరుద్ధ పనుల కోసం ఆ ముగ్గురు కొత్త పంతులు వెతుక్కున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కారునే లింగ నిర్ధారణ కేంద్రంగా మార్చుకున్నరు. ఘనులు ఊరూఊరూ తిరుగుతూ లింగ నిర్ధారణ, గర్భ విచ్ఛిత్తిలకు తెగబడ్డారు. ఈ కేసుకు సంబంధించి అయిదు రోజుల క్రితం చింతకాని మండలంలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. ముఠా సూత్రధారులు ఎవరు? దీని వెనక పెద్ద రాకెట్ ఏమైనా ఉందా? గర్భవిచ్ఛిత్తికి సహకరిస్తున్న వైద్యుడెవరు? ఆరోగ్య శాఖ సిబ్బంది పాత్ర ఎంత? తదితర సందేహాలున్నా.. ‘కేసు విచారిస్తున్నాం. ప్రధాన నిందితుడు దొరికితే పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అంటూ పోలీసు అధికారులు సెలవిస్తున్నారు.
ముగ్గురితో సాధ్యమయ్యే పనేనా ?
ప్రధాన నిందితుడు చారి స్వస్థలం ఖమ్మంలోని బల్లేపల్లి. మరోఇద్దరు నిందితులైన కొదుమూరుకు చెందిన ఆర్ఎంపీ రాచబంటి మనోజ్, అల్లీపురం కాత్యాయనీలు పట్టుబడిన నాటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులనైనా విచారించకపోవటం పై విమర్శల వస్తున్నాయి .. కనీసం సభ్యులనైనా విచారించకపోవటం విమర్శలకు తావిస్తోంది. చారి ప్రధాన పాత్ర దారుడు అనడం మినహా.. పోలీసులు పూర్తి వివరాల నిర్ధారణకు రాలేదు. ఆ ఇద్దరు నిందితుల్ని రోజూ పోలీస్ స్టేషన్కు తీసుకురావడంతోనే విచారణ సాగుతోంది. మొత్తం ముగ్గురు నిందితులే గర్భవిచ్ఛిత్తి వంటివి చేయలేరు.? నిపుణులైన వైద్యుల భాగస్వామ్యం తప్పనిసరి. మరి వారెవరన్నది తేలాల్సి ఉంది. తెర వెనక సూత్రధారులే ప్రధాన నిందితుడు చిక్కకుండా తప్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.?
ప్యాకేజీలు వారే నిర్ణయిస్తారు.ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి గతంలో పీఆర్వోగా వ్యవహరించిన చారి, మనోజ్, కాత్యాయనీలు పాత పరిచయాలతో బృందంగా ఏర్పడి అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. వీరు ప్రధానంగా డోర్నకల్ మండలం అమ్మపాలెం, మహబూబాబాద్, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లోని గిరిజన మహిళల వివరాలను స్థానిక ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తల సాయంతో సేకరించినట్లు సమాచారం. రెండో కాన్పులో మగ పిల్లాడు కావాలనుకున్న వారు, గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని నిర్ధారణ అయితే.. నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావం చేయించేవారు. భార్యాభర్తల మధ్య వివాదాలు ఉండి గర్భస్రావం చేయించుకునేవారు. ఖమ్మంలో గతంలో వివాదాలు ఎదుర్కొన్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షల నిమిత్తం వచ్చేవారినీ ఈ ముఠా లక్ష్యంగా చేసుకునేవారు. కడుపులో ఉన్న బిడ్డ ఆడా? మగా? అనేది మొబైల్ వాహనంలో అల్ట్రా స్కానింగ్ యంత్రం ద్వారా నిర్ధారిస్తున్నారు. తమకు సత్సంబంధాలున్న ఆసుపత్రుల్లో గర్భస్రావం చేయిస్తున్నారు. కోలుకున్న తర్వాత తమ వాహనంలోనే స్వగ్రామాలకు పంపేవారు. కొందరికి కొదుమూరులో, మరికొందరికి ఇల్లెందు, ఖమ్మం ప్రాంతాల్లో గర్భవిచ్ఛిత్తి చేయించినట్లు తెలుస్తోంది.
ఇందుకు గాను ఒక్కొక్కరి వద్ద పరిస్థితిని బట్టి రూ. 15,000- 1,00,000 వసూలు చేసేవారు. ఏది ఏమైనాప్పటికీ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేయిస్తేనే దోషులెవ అన్నది తేలుతుంది.









